Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కరకగూడెం
మండల పరిధిలోని సమత్ మోతె గ్రామంపంచాయతీలో రైతు కన్నీళ్లు తుడిచే వ్యవసాయ రంగానికి ప్రాముఖ్యత ఇచ్చే పులుసు బొంత ప్రాజెక్టు నిర్మాణ కొరకు గురువారం రఘనాథపాలెం, బర్లగూడెం, తాటిగూడెం, వెంకటాపురం గ్రామాల రైతులు, ఇంజనీరింగ్, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో కెనాల్ రీ ఎలైన్ మెంట్ కోసం ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పరిశీలించారు. అనంతరం సీడీపీ నిధులు నుండి 10లక్షల వ్యయంతో మోతె, తాటిగూడెం ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరి గోడ నిర్మాణ శంకుస్థాపన చేశారు. తాటిగుడెం ప్రభుత్వ పాఠశాల వంట షెడ్డు ఏర్పాటు కోసం రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.10 వేలు రేగా కాంతారావు సహాయ చేశారు.
ఈ కార్యక్రమంలో ఈఈ బాబురావు, డీఈ నాగమల్లేశ్వర రావు, ఏఈ సక్రు, రెవెన్యూశాఖ ఆధికారి రాజు,ఫారెస్ట్ అధికా రులు, సర్పంచులు పోలెబోయిన నర్సింహారావు, కొమరం విశ్వనాథం, పాపమ్మ, పాయం నరసింహారావు, ఎంపీడీవో శ్రీను, బయ్యారం సీఐ రాజ గోపాల్, ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్,పార్టీ నాయకులు అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి,కొంపెల్లి పెద్ద రామలింగం తదితరులు పాల్గొన్నారు.