Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
ములకలపల్లి మండలంలోని రాజాపురం గ్రామంలో అడపా నాగేశ్వరరావు పుచ్చతోటలో వివాంట సీడ్స్ ఆధ్వర్యంలో మాధవి పుచ్చరకం రైతులు, డీలర్లకు క్షేత్ర ప్రదర్శన జరిగింది. రైతు అడపా నాగేశ్వరరావు మాట్లాడుతూ వివాంట వారి మాధవి రకం 10 ఎకరాలు సాగు చేయడం జరిగిందని, కాయ సైజు బాగా వచ్చిందని, పంట చీడ పేడలు తట్టుకుంటుందని తెలిపారు. ఒక ఎకరానికి 18 టన్నులు దిగబడి వస్తుందని, ఈ రకం అందరూ సాగు చేసుకునే రకమని వివరించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు కిషోర్, డిస్ట్రిబ్యుటర్ నవీన్, చందు, దేవేందర్లతో పాటు 70 మంది రైతులు, 10 మంది డీలర్లు, మండల ముఖ్యులు నాగళ్ల వెంకటేశ్వరావు, తిరుపతిరెడ్డి, బాల అప్పారావు పాల్గొన్నారు.