Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐ బి.అశోక్
నవతెలంగాణ-చర్ల
సమాజసేవలో పాత్రికేయులు ముందంజలో ఉండాలని చర్ల సీఐ బి.అశోక్ అన్నారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో నవతెలంగాణ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. పరిస్థితులకు అనుగుణంగా నిరుపేదల పట్ల మానవత్వాన్ని చాటుతూ, పేదలకు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. పత్రికలు ప్రజా గొంతుకలన్నారు. సమాజంలో జరిగే ప్రతి విషయంపై అవగాహన కలిగి ఉండి నిరుపేదలకు చేయుతగా పాత్రికేయులు ఉండాలని సూచించారు. సమాజంలో జరిగే సంఘటనలను అవగతం చేసుకొని న్యాయం చెప్పే జెడ్జిల్లా పాత్రికేయులు వ్యవహరించాలని ఆయన కోరారు. ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడే నవతెలంగాణ పేపరు అభినందనీయంమైనదని అన్నారు.