Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
మండలంలోని మల్కారం గ్రామంలో వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం పంటకోత ప్రయోగాన్ని నిర్వహించారు. మల్కారం గ్రామంలోని ఖరీఫ్ చివరలో వేసిన వేరుశనగ పంట పీకే దశలో ఉన్నందున అక్కడ ఏఓ చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో పంట కోత ప్రయోగాన్ని నిర్వహించగా 14 నుండి 16 క్వింటాల్ దిగుబడి రావడం జరిగింది. వేరుశనగలో దిగుబడి ఆశాజనకంగా ఉందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారిణి జ్యోతి, సర్పంచ్ రూప్సింగ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.