Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
మండలంలోని మల్కారం గ్రామంలో భవన నిర్మాణ కార్మికులు శుక్రవారం నూతన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ నూతన సంఘంలో కార్యవర్గ సభ్యులు అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీఆర్‌యస్ పార్టీ ఇన్చార్జ్ జారే ఆదినారాయణ పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులందరూ సంఘటితంగా ఉండి తమ హక్కుల కోసం పోరాడాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్సును పొందేలా సంఘం కృషి చేయాలని దానికి నావంతు సహాయం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంకత ఉమామహేశ్వరరావు, రాచూరుపల్లి సర్పంచ్ తోట రాజు, మల్కారం సర్పంచ్ కొనుసోతు రూప్సింగ్, సీనియర్ నాయకులు శ్రీరాముల ప్రసాద్, అన్నవరపు పుల్లారావు పాల్గొన్నారు. నూతన కార్యవర్గ సభ్యులలో అధ్యక్షులుగా కపిలేశ్వర రమేష్, వైస్ ప్రసిడెంట్‌గా నక్కల వేణులు ఎంపికయినట్లు తెలియజేశారు.