Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డిసెంబరు నెల బొగ్గు ఉత్పత్తి 92 శాతం
అ జీఎం జక్కం రమేష్
నవతెలంగాణ-మణుగూరు
వార్షిక లక్ష్యాలను అధిగమించే దిశగా మణుగూరు ఏరియా ముందజలో ఉన్నదని ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేష్ అన్నారు. శుక్రవారం స్థానికి జీఎం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ డిసెంబరు నెల బొగ్గు ఉత్పత్తి 92 శాతం సాధించిందన్నారు. ఉత్పాదకత 111 శాతం సాధించి రికార్టులను సృష్టించిందన్నారు. ఓబీ వెలికితీత 96 శాతం తీశామన్నారు. రైల్వే ద్వారా బొగ్గు రవాణా 153 ర్యాక్స్ పంపడం జరిగిందన్నారు. బొగ్గు ఉత్పత్తి రవాణాలో 2021-22 వార్షిక లక్ష్యాన్ని అధిగమించేందుకు చేరువలో ఉన్నామన్నారు. కరోనా, రక్షణ చర్యలు తీసుకోవడంలో ఏరియా అధికారులు అహార్నిశలు కృషి చేస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు వెంకటేశ్వర్లు, లక్ష్మీపతిగౌడ్, రమేష్, నర్సిరెడ్డి, డాక్టరు నాగరాజు, శ్రీనీవాస్, సీనీయర్ ఎస్టేట్ అధికారి ఉషశ్రీ, సింగు శ్రీనీవాసరావు తదితరులు పాల్గొన్నారు.