Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల రామయ్యను జిల్లా సివిల్ సప్తై అధికారి చంద్ర ప్రకాష్ శుక్రవారం కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది వారికి ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి ప్రదాన ఆలయంలో పురోహితులు బార్గవాచార్యులు, శేషం కిరణ్ కుమారా చార్యులు ప్రత్యేక పూజలతో పాటు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం వారు సీతాకుటీర ప్రదేశంతో పాటు నారచీరల ప్రాంతాలను సందర్శించి పర్ణశాల విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మండల రేషన్ డీలర్స్ అసోసియేషన్ మండల అద్యక్షులు కొమరం ముత్తయ్య తదితరులు ఉన్నారు.