Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూలూరుపాడు
మండల పరిధిలోని బచ్చల కోయగూడెం గ్రామంలో సేవా భారతి అధ్వర్యంలో కే.ఎస్ రావు, శ్రీదేవి దంపతుల కుమారుడు, కొడలు (ఎన్ఆర్ఐ) కేశవ్, సలియోన దంపతులు శుక్రవారం గ్రామంలోని పేదలకు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రసాదరావు, ట్రైనీ ఎస్ఐ కార్తిక్, ఉపాధ్యాయులు యదలపల్లి వీరస్వామి పాల్గొని వారి చేతుల మీదగా దుప్పట్లు చీరలను పేదలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం విభాగ్ సేవా ప్రముఖ్ మునీశ్వర్ జి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా సేవాభారతి ద్వారా భద్రాచలం జిల్లాలోని గిరిజన గ్రామాల నుండి 1990 సంవత్సరం నుండి బూర్గంపాడు భారతి భవన్ ఆవాస కేంద్రంగా విద్యార్థిని విద్యార్థులకు 2000 మందిని ఉన్నత విద్యావంతులుగా, డాక్టర్, ఇంజనీరింగ్, పోలీస్, ఫారెస్ట్, ఉపాధ్యాయ, నర్సింగ్ జాబ్ వృత్తిలో స్థిరపడే విధంగా ప్రోత్సాహం ఇచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రసాదరావు మాట్లాడుతూ కేశవ్ జర్మనీ దేశంలోని లక్సెంబర్గ్‌లో ఉన్నత చదువు చదువుకుంటూ, క్రికెట్, యోగ ద్వారా వచ్చిన డబ్బులతో పేదలకు సహాయం చేయడం అనే దృక్పథం కలిగి ఉండటం ఎంతో సంతోషకరమని అదేవిధంగా హరితహరం కార్యక్రమం ముఖ్యఉద్దేశం తెలిపారు. ఉపాద్యాయులు వీరస్వామి మాట్లాడుతూ పేదలకు సహాయం చేయడం ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కేశవ దంపతులను కోరారు.