Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నీట్ విద్యార్థికి రూ.ఐదు వేలు ఆర్థిక సాయం
నవతెలంగాణ-గుండాల
నీట్ ఫలితాల్లో మంచి మార్కులు సాధించినట్టుగానే ఎంబీబీఎస్ చదివి మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఎస్ఐ దారం సురేష్ అన్నారు. ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించిన మండలంలోని పాలగూడెం గ్రామానికి చెందిన ఈసం అన్వేష్‌ను శుక్రవారం పాలగూడెంలో కలిసి రూ.ఐదు వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ..అనుకున్నది సాధించాలంటే ఏజెన్సీ మారుమూల గ్రామాల యువత కూడా ధృడ సంకల్పంతో ఉండి తమ లక్ష్యాలను చేరుకున్నప్పుడే ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. కార్యక్రమంలో నీట్ విద్యార్థి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.