Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
భారత విద్యార్ది ఫె˜డరేషన్ (ఎస్ఎఫ్ఐ) 52వ ఆవిర్భావ వేడుకలను మండల కేంద్రమైన దుమ్ముగూడెం గ్రామంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి కారం సందీప్ అద్యక్షతన జరిగిన ఆవిర్భావ వేడుకలకు మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు డీవైఎఫ్ఐ మండల అధ్యక్షులు గుడ్ల సాయిరెడ్డి పాల్గొని జెండా ఎగుర వేశారు. అనంతరం సాయిరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో జయరామ్, సాయి, కృష్ణ, తరుణ్, పూజ, వైష్ణవి, ఆలేఖ్య, వంశీ, శ్రవణ్, సందీప్‌లతో పాటు కళాశాలకు చెందిన విద్యార్దిని, విద్యార్దులు పాల్గొన్నారు.
కరకగూడెం : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పినపాక డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని భట్టుపల్లి గ్రామపంచాయతీలోని విరపురం జంక్షన్లో ఎస్ఎఫ్ఐ 52వ ఆవిర్భావ దినోత్సవం సంద ర్భంగా స్వాతంత్య్రం ప్రజాస్వామ్యం సోషలిజం జెండాను శుక్రవారం ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి రమాటేంకి శ్రీను ఆవిష్కరించి, మాట్లాడారు. సమరశీల పోరాటాలకు యువత సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వంశీ, ప్రణరు, విద్యార్థులు పాల్గొన్నారు.