Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా మంత్రి పువ్వాడ అజరు రాక
విలేకర్ల సమావేశంలో ఎంఎల్ఏ సండ్ర వెంకట వీరయ్య
నవతెలంగాణ- కల్లూరు
మధిర మాజీ శాసనసభ్యులు కట్టా వెంకటనర్సయ్య విగ్రహావిష్కరణ ఈనెల రెండో తేదీన నిర్వహిస్తున్నట్లు సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. మండల పరిధిలోని పోచారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల రెండో తేదీన ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జిల్లాకు రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో పర్యటన వాయిదా పడిందన్నారు. జిల్లా మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కట్టా వెంకటనర్సయ్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం ఎంపి, జిల్లా ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, కట్టా అభిమానులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. జడ్పీటీసీ కట్టా జయకుమార్ మాట్లాడుతూ తమ తండ్రి రెండో తేదీన మృతి చెందడం వల్ల ఆ రోజే విగ్రహ ఆవిష్కరణ చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారని, ఆ మేరకు ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బీరవల్లి రఘు, రైతు సమితి మండల కన్వీనర్ లక్కినేని రఘు, డీసీసీబీ డైరక్టర్ బోబో లక్ష్మణ్‌రావు, పుసులూరు శ్రీనివాసరావు, ముచ్చవరం సర్పంచ్ గంగవరపు శ్రీనివాసరావు కె.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.