Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు
నవతెలంగాణ - వైరాటౌన్
మిర్చి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైరా మండలం గోల్లెనపాడ్ గ్రామంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రైతులు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు మాట్లాడుతూ మిర్చి పంట నష్టం ప్రకతి విపత్తుగా ప్రకటించి ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, జనవరి 2వ తేదీన ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్న రాష్ట్ర మంత్రి కెటిఆర్ మిర్చి పంట నష్టపరిహారం గురించి స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మిర్చి రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం తక్షణమే మిర్చి రైతులను అదుకొనేందుకు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం వైరా మండల కార్యదర్శి నల్లమోతు వెంకటనారాయణ, సిఐటియు మండల కన్వీనర్ తోట నాగేశ్వరావు, రైతు సంఘం సహాయ కార్యదర్శి కిలారు శ్రీనివాసరావు, రైతు సంఘం గ్రామ కార్యదర్శి వెంపటి రాజా ,చండ్ర ప్రసాద్, కొణిదన ధర్మారావు, వెంపటి సత్యం, రాజేంద్ర ప్రసాద్, ఆళ్ళ రాంబాబు, ఆళ్ళ ప్రసాద్, గోవర్థన్, కంచర్ల శ్రీనివాసరావు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.