Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- మధిర
ఉద్యోగులపై ఉక్కుపాదం మోపి బలవంతపు బదిలీ చేస్తూ తీవ్ర మనోవేదనకు కారణమవుతున్న ప్రభుత్వ ఉత్తర్వులు 317ను సవరించి స్థానికతను ప్రామాణికంగా తీసుకొని ఉద్యోగ విభజన చేయాలని కోరుతూ స్థానిక యూటీఎఫ కార్యాలయం నందు మండల ఉపాధ్యక్షులు వీరయ్య అధ్యక్షతన మండల ఆఫీస్ బేరర్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి షేక్ నాగూర్ వలి, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాళ్లూరి ఆంజనేయులు మాట్లాడుతూ 317ను సవరించాలని, సీనియారిటీ తప్పులు సవరించాలని, పారదర్శకత పాటించాలని, ఒంటరి మహిళలకు, వికలాంగులకు, వితంతువులకు బదిలీలలో ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు. సమావేశంలో మండల మహిళా ఉపాధ్యక్షులు కస్తూరిబాయి, కోశాధికారి లాల్ అహ్మద్, కార్యదర్శులు ఇబ్రహీం, సాదు సమాధానం, భీమ శంకర రావు, కొండలరావు, ఎన్ వి, భాస్కర రావు, సురేష్, నరసింహారావు, హసీనా బేగం తదితరులు పాల్గొన్నారు.