Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగులను నిరాశ మిగిల్చిన 2021
జీవో 315 రద్దుకు ఉద్యోగుల డిమాండ్
నవ తెలంగాణ- బోనకల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. జిల్లాల విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజనకు సంబంధించి ప్రభుత్వం 317 జీవోను జారీ చేసింది. సీనియార్టీ ప్రాతిపదికన ఉద్యోగులను పొరుగు జిల్లాలకు కేటాయించడంతో ఈ ఏడాది వారికి తీవ్ర నిరాశను మిగిల్చింది. ఖమ్మం జిల్లాలో మొత్తం 4,890 పోస్టులు కేటాయించారు. భద్రాద్రికి 3,666 మంది ఉపాధ్యాయులను కేటాయించారు. మహబూబాబాద్‌కు 350 ములుగు కు 255 పోస్టులు కేటాయించారు. ఖమ్మం నుంచి అన్ని కేటగిరీలకు సంబంధించి 558 మంది టీచర్లు పొరుగు జిల్లాలకు వెళ్లారు. ఇతర జిల్లాల నుంచి 594 మంది వచ్చారు. భార్యాభర్తలు ఒకే జిల్లాలో పని చేసేవారు నూతన నిబంధనల మేరకు వేరే జిల్లాకు కేటాయించడంతో వారు తీవ్ర నిరాశ నిస్పహలకు లోనయ్యారు.
కొనసాగుతున్న ఆందోళనలు - పూర్తవుతున్న కేటాయింపులు
ఉద్యోగాల కేటాయింపు విధానాలు వరుస విధానాల్లో మార్పు ప్రకటనలతో వారిలో ఆగ్రహానికి కారణమైంది. ధర్నాలు, ర్యాలీలు, నిరసన, ముట్టడి కార్యక్రమాలు ఒకవైపు కొనసాగుతుండగానే మరొకవైపు ప్రభుత్వం తమ పని తాను చేసుకుపోతూనే ఉంది. ప్రారంభంలో 317 జీవో ద్వారా ఇబ్బంది ఉండదని చెప్పినా స్థానికతను పట్టించుకోకుండా సీనియార్టీ ప్రాతిపదికన తీసుకోవడం తమకు తీవ్ర నష్టం కలిగించిందని జూనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పౌజ్ కేసులకు సంబంధించి వివాదాలు అడ్ హక్ పద్ధతిలో పోస్టింగ్ ఇస్తున్నట్లు చెప్పి ఆ తరువాత పర్మినెంట్ పోస్టింగ్ అనడం మాన్యువల్ బదిలీలు లేకుండా ఆర్డర్లు నేరుగా సంబంధిత ఉపాధ్యాయులు సెల్ ఫోన్లకు పంపిస్తామని చెప్పటం లాంటి వరుస మార్పుల ప్రకటనలతో బాధిత ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉపాధ్యాయులు కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయించడం బాధితులు అప్పీళ్లను పరిగణలోకి తీసుకోవాలని సూచనలు చేయటంతో కౌన్సిలింగ్ తాత్కాలికంగా వాయిదా వేశారు. అంతా ఒకే చోట స్థిరపడ్డాక జిల్లాల విభజన ప్రక్రియ తమను దూరప్రాంతాలకు బదిలీ చేసిందని ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తాము మానసిక క్షోభను అనుభవించామని జూనియర్ ఉద్యోగులు తమ మానసిక ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
విద్యారంగంపై కరోనా తీవ్ర ప్రభావం
రాష్ట్రవ్యాప్తంగా అన్ని రంగాల కన్నా విద్యారంగం పై కరోనా తీవ్ర ప్రభావం చూపించింది. విద్యాసంస్థల రెండేళ్లపాటు మూతపడ్డాయి. ఆ ప్రభావం విద్యార్థులపై తీవ్రంగా పడింది. పాఠశాలకు రెండు సంవత్సరాల విద్యార్థుల దూరం కావడంతో చదువు కూడా వారికి దూరం అయింది. కరోనా తీవ్రత తగ్గటంతో విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడంతో విద్యార్థులు వస్తారో లేదోనని ప్రభుత్వం భయాందోళన వ్యక్తం చేసింది. చివరకు ప్రభుత్వ బడులలో అత్యధిక విద్యార్థులు చేరటంతో పాఠశాలలు కళకళలాడాయి.
మండలాన్ని వణికించిన కరోనా...
రెండో దశ కరోనా మండల ప్రజలను గడగడలాడించింది. మండలంలో 22 గ్రామాలకు తీవ్ర ప్రభావం చూపింది కరోనా వ్యాధితో మండల వ్యాప్తంగా సుమారు 25 మంది మృత్యువాత పడ్డారు. కరోనా మృతులలో బోనకల్ గ్రామానికి చెందిన ఉస్మానియా వైద్యాధికారి వజ్రాల యుగంధర్ కూడా ఉన్నారు. కరోనా వ్యాధి తీవ్రత కారణంగా ప్రతి ఒక్కరు ఆస్పత్రి పాలై లక్ష రూపాయలు హాస్పటల్‌కు అనిపించుకున్నారు. 2021 సంవత్సరం మండల ప్రజలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది.