Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
2022నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ని యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చావ దుర్గాభవాని, జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి నెల్లూరి వీరబాబు ఆవిష్కరించారు. స్థానిక యుటీఎఫ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల తీసుకుని వచ్చిన 317 ఉత్తర్వులు తెలంగాణ ఉద్యమం స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. ఈ ఉత్తర్వుల వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని, సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి లేదా భవిష్యత్తులో ఏర్పడబోయే ఖాళీలలోకి ఉపాధ్యాయులను వారి స్వంత జిల్లాలో నియమించడానికి ప్రభుత్వం హామీ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగమల్లేశ్వరరావు, పారుపల్లి నాగేశ్వరరావు నాయకులు బుర్రి వెంకన్న, వి.రాంబాబు, ఎస్కె. షమీ, రంజాన్, బి.మంగిలాల్, పి.సురేష్, రోజా తదితరులు పాల్గొన్నారు.