Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రఘునాధపాలెం
తెలంగాణలో సినిమా థియేటర్ల సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకుండా కేవలం టికెట్ల ధరలను పెంచి ప్రేక్షకులపై భారాలు మోపడాన్ని ప్రజలు వ్యతిరేకించాలని, వెంటనే పెంచిన సినిమా టికెట్ ధరలను తగ్గించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్ డిమాండ్ చేశారు. జింకలతండ గ్రామ డీవైఎఫ్ఐ సమావేశం మండల అధ్యక్షులు షేక్ షరీఫ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో డీవైఎఫ్ఐ మండల అధ్యక్షుడు షేక్ షరీఫ్, నాయకులు అబ్దుల్, సురేష్, అఖిల్, రహీమ్ పాల్గొన్నారు.