Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
ఖమ్మంరూరల్ మండలానికి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలను ఏదులాపురం పంచాయతీ వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద గల తరుణిహాట్కు తరలించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, పాలేరు ఇంచార్జ్ బండి రమేష్ అన్నారు. మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవన్లో శుక్రవారం సిపిఎం మండల కమిటీ సమావేశం పార్టీ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో బండి రమేష్ మాట్లాడారు. ఖమ్మంరూరల్ మండల ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ కార్యాలయాలన్ని ఖమ్మం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయని, దీంతో ప్రజలు ప్రభుత్వ సేవలు పొందాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఖమ్మం రూరల్ తాసిల్దార్ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, రూరల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్, ఐసిడిఎస్, సిడిపిఓ కార్యాలయం, ఖమ్మంరూరల్ గ్రంథాలయం, ఎన్పిడిసిల్, ఏడిఈ కార్యాలయాలు ఖమ్మం నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయని, వీటి సేవలు పొందాలంటే ప్రజలు సమయాభావం, ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఖమ్మంరూరల్ మండల జనాభా లక్ష పైనే ఉన్నారని,నిత్యం ప్రజలకు ఉపయోగ పడే కార్యాలయలు ప్రజలకు అందుబాటులో లేకుండా రూరల్ మండలానికి దూరంగా ఉండటం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. అలాగే మండల జనాభా దృష్ట్యా మరో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని కార్యాలయాలు అందరికీ అనువైన ప్రాంతం వరంగల్క్రాస్రోడ్లో ఏర్పాటు చేసి, వరంగల్ క్రాస్ రోడ్‌ను మండల హెడ్ క్వార్టర్‌గా ప్రకటించాలని కోరారు. సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో త్వరలోనే పాలేరు ఎంఎల్ఏ కందాల ఉపేందర్‌రెడ్డి, మంత్రి అజరు, ఎంపీ నామా, కలెక్టర్లను కలిసి ఈ సమస్యను వివరించి వినతిపత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఊరడి సుదర్శన్‌రెడ్డి, తుమ్మల శ్రీనివాసరావు, పి.సంగయ్య, పి.మోహన్‌రావు, తోట పెద్ద వెంకట రెడ్డి, నందిగామ కృష్ణ, యామిని ఉపేందర్, పెండ్యాల సుమతి, మండల నాయకులు పొన్నం వెంకటరమణ, సిలివేరు బాబు, ఏటుకూరి ప్రసాద్‌రావు, మెడికొండ నాగేశ్వరరావు, యర్రా నర్సింహరావు, తాటి వెంకటేశ్వర్లు, రంజాన్, రామయ్య, గాయత్రి, జక్కంపూడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.