Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అభినందనలు తెలిపిన కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
ఢిల్లీలో ఈ నెల 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నృత్య ప్రదర్శనలో కొత్తగూడెం జిల్లా విద్యార్థులు నృత్య ప్రదర్శన చేయడానికి ఎంపిక కావడం పట్ల జిల్లా కలెక్టర్ దురిశెట్ట అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ దేశ రాజధాని అతిరధమహారదుల సమక్షంలో ఎంతో కన్నుల పండుగగా జరిగే గణతంత్ర వేడుకల్లో మన జిల్లా విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆజాది కా అమృత్ మహౌత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా రక్షణశాఖ ఆధ్వర్యంలో గత సంవత్సరం నవంబర్ 25 నుండి డిసెంబర్ 19వ తేదీ వరకు నిర్వహించిన వేడుకల్లో శ్రీ దుర్గాసాయి నృత్య నికేతన్ గురువు డాక్టర్ సీతాప్రసాద్ శిష్య బృందంలోని 10 మంది విద్యార్థులు మన సంస్కృతి సాంప్రదాయాలపై ప్రదర్శన చేసి ఎంపిక కావడం జరిగిందని చెప్పారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని ప్రథమస్థానంలో నిలిచిన విద్యార్థులు బెంగుళూరులో జోనల్యిలో నిర్వహించిన పోటీల్లో సైతం గెలుపొంది జాతీయస్థాయిలో ఢిల్లీలో నిర్వహించిన పోటీలలో ప్రధమస్థానాన్ని సాధించినట్లు చెప్పారు. జనవరి 26న రాజధానిలో నిర్వహించనున్న నృత్య ప్రదర్శనకు ఎంపిక కావడం జరిగిందని చెప్పారు. మన జిల్లాకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకు రావాలని కలెక్టర్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందచేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గాసాయి నృత్య నికేతన్ నిర్వాహకులు డాక్టర్ సీతాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.