Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ప్రిన్సిపాల్ నవీన జ్యోతి
నవతెలంగాణ-గుండాల
డ్రాప్ అవుట్ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి కళాశాలకు వచ్చే విధంగా చూడాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నవీన జ్యోతి అన్నారు. ఈ విషయమై మంగళవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాల నాయకులతో మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. డ్రాప్ అవుట్ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి హాజరు శాతం పెంచేందుకు తోడ్పడాలని వారితో చర్చించారు. డ్రాప్ అవుట్ విద్యార్థుల లిస్టును గ్రామ పంచాయతీల వారిగా వారికి ఇవ్వగా అందుకు వారు తప్పకుండా సహకరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముక్తి సత్యం, జడ్పీటీసీ వాగబొయిన రామక్క, గుండాల ఎంపీటీసీ ఎస్కే సంధాని, సాయనపల్లి ఎంపీటీసీ కల్తి క్రిష్ణారావు,తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంపిడి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు ఎర్రయ్య, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ డివిజన్ నాయకులు ఈసం శంకర్, పీడీఎస్ యూ జిల్లా నాయకులు కాంపాటి పథ్వి, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు హరీష్, వైయస్సార్ టీపీ మండల నాయకులు తవిడిశెట్టి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.