Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
ఆదమరిస్తే ప్రయాణం అనంత లోకాల అంచున వున్నట్లే అన్నవిధంగా మండలంలోని బీటీ రోడ్లు మారాయి. ముఖ్యంగా యార్రగుంట నుండి అన్నపురెడ్డిపల్లి మధ్య గల తారు రోడ్డు గుంటలు మామయమై తరచూ ప్రమాదాలు జరుగుతు న్నాయి. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని కనీసం గుంటలకు కూడా ప్యాచ్లు వేయడం లేదని అనేక మంది ద్విచక్ర వాహనదారులు కిందపడి కాళ్ళు చేతులు విరిగిన సంఘటనలు చాలా వున్నాయి. రాజపురం నుండి పెంట్లం గ్రామాల మధ్య పది మీటర్లకు ఒక గుంట ఉంది. రాజపురం సెంటర్ రింగ్ రోడ్డు దగ్గర మూల మలుపులతోపాటు పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయి. ఆటో ప్రయాణికులు అయితే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటికీ అయిన ప్రజలు ప్రాణాలు పోక ముందే గుంటలు పూడ్చి ప్రమాదాలను నివారించాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.