Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు
అంకిరెడ్డి కృష్ణారెడ్డి
నవ తెలంగాణ-చండ్రుగొండ
రైతు కళ్లల్లో ఆనందం చూడటమే టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమని అందులో భాగంగానే రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు పథకం అమలు చేసినట్లు జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు బంధు సంబరాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసిఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. జెడ్పిటిసి కొడగండ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రైతు బంధు పథకం గొప్ప వరం, కానీ ఆ పథకం కేవలం భూస్వాములకు, బడా రైతులకే పరిమితమైందని అన్నారు. నేడు ఎంతోమంది చిన్న సన్నకారు రైతులు రైతు బంధు రాకా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా కౌలు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి వారందరికీ రైతు బంధు, రైతు బీమా, అందినప్పుడే రైతు కళ్లల్లో ఆనందం కనిపిస్తోందని అన్నారు. మండల వ్యవసాయ శాఖ అధికారి నవీన్ బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు రైతుబంధు సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూడవ రోజు రైతు బంధు గురించి ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస ముగ్గుల పోటీలు నిర్వహించడం, నాలుగో రోజు ప్రతి గ్రామంలో ప్రతి రైతు ఇంట్లో రంగులతో రైతు బంధు గురించి తెలిసేలా ముగ్గులు వేయడం, ఐదో రోజు ఉత్తమ రైతులకు సన్మాన కార్యక్రమం వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, రైతుల సమక్షంలో నిర్వహించడం, ఆరో రోజు ఏఎంసి, సహకార సంఘం సొసైటీ కార్యాలయాల ముందు రైతుబంధు గురించి అలంకరణ అలాగే ప్రదర్శన నిర్వహించడం, ఏడవ రోజు మండల స్థాయిలో ఎడ్లబండ్లు ట్రాక్టర్లు ద్వారా రైతు బంధు విశిష్టత గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లిపెద్ది లక్ష్మీ భవాని, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దారా వెంకటేశ్వరరావు (బాబు) ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, వైస్ ఎంపీపీ నరకుల్లా సత్యనారాయణ, గానుగపాడు సొసైటీ చైర్మన్ చెవుల చందర్ రావు, సర్పంచులు బానోత్ కుమారి, పూసం వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ భానోత్ బాలు, సొసైటీ డైరెక్టర్లు ఉన్నం నాగరాజు, పసుపులేటి వెంకటేశ్వర్లు, మండల రైతు కోఆర్డినేటర్ గాదె లింగయ్య, ఎంఈఓ సత్యనారాయణ పాల్గొన్నారు.
రైతు బంధు రైతుకు వరం
అన్నపురెడ్డిపల్లి : రైతు పంట పెట్టుబడులు కాలంలో రైతు బంధు ఇవ్వడం ఎంతో గొప్ప అని మండలంలోని వ్యవసాయ అధికారులు సమక్షంలో మండల కేంద్రంలోని రైతు వేదిక నందు రైతు బంధు సంబరాలు ఎడిఎ అఫ్జల్ బేగం మండల వ్యవసాయ అధికారి అనూష ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఎడిఎ అఫ్జల్ బేగం మాట్లాడుతూ మండలంలో పది పంచాయితీల్లో 4034 మంది రైతులు రైతు బందుకు అర్హులైన వారు వుండగా మెత్తం 11017 ఎకరాలకు గాను 55087447 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఏఈఓ ప్రశాంత్ సంధ్యారాణి రైతులు పాల్గొన్నారు.