Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కల్లూరు
మంజూరైన పంట కల్లాలకు వెంటనే నిర్మాణాలు పూర్తి చేసేందుకు అధికారులు దృష్టి పెట్టాలని ఎంపీడీవో టి.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంట కల్లాల నిర్మాణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎండీఓ మాట్లాడుతూ మండలాల్లో 240 కల్లాలు మంజూరయ్యాయన్నారు.40 కల్లాలు మాత్రమే పూర్తికాగా, మరో 80 నిర్మాణం దశల్లో ఉన్నాయని, మిగిలిన 110 కల్లాలు ప్రారంభం కాలేదన్నారు. వారం రోజుల్లో పంట కల్లాల నిర్మాణాలు పూర్తిచేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కల్లాల్లో నిర్మించినవారికి వెనువెంటనే బిల్లు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి రూప, ఎంపీఈవో వీరాస్వామి, ఏపీఓ హేమమాలిని, ఈజియస్ సిబ్బంది వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.