Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
బృహత్ పల్లె ప్రకృతి వనం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని నాడు వద్దన్న కలెక్టర్ నేడు అందులో మొక్కల పెంపకాన్ని పరిశీలించి చాలా బాగుంది అంటూ అధికారుల, ప్రజాప్రతినిధులపై జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ ప్రశంసల జల్లు కురిపించారు. మండల పరిధిలోని చిరునోముల గ్రామపంచాయతీలో మండల స్థాయి బృహత్ పల్లె ప్రకృతి వనం కోసం గత ఏడాది12 ఆగస్టు నెలలో మార్కెటింగ్ గిడ్డంగి పక్కనే గల ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మండల అధికారులు ఎంపిక చేశారు. 12 ఆగస్టు 2021 బహత్ పల్లె ప్రకృతి వనం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ సవాంగ్ చిరునోముల స్వయంగా వచ్చి పరిశీలించారు. ఆనాడు డి ఆర్ డి ఓ మెరుగు విద్యా చందన ఎంపీడీవో గొట్టిపాటి శ్రీదేవి తాసిల్దార్ రావూరి రాధిక చిరునోముల సర్పంచ్ ములకారపు రవి గ్రామ పంచాయతీ కార్యదర్శి బంధం అర్జున్ ఈ స్థలాన్ని కలెక్టర్‌కి చూపించారు. ఎంపిక చేసిన స్థలం మొత్తాన్ని కలెక్టర్ గౌతమ్ కలియా తిరిగి పరిశీలించారు. ఈ స్థలాన్ని పరిశీలించి వెంటనే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో మండల అధికారు లను ఉద్దేశించి రాళ్లు రప్పల్లో కూడా పెరిగే మొక్కలుంటాయా అంటూ మండల అధికా రులను కలెక్టర్ గౌతం సున్నితంగా మందలిం చారు. మొక్కలు సజావుగా పెరిగే స్థలాన్ని ఎంపిక చేస్తారా, మొక్కలు పెరగని స్థలాన్ని ఎంపిక చేస్తారా అని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మండల అధికారులు మండలం లో ప్రభుత్వ స్థలం లేదని సమాధానం చెప్పడంతో కలెక్టర్ వెంటనే మండలంలో ఎక్కడా ప్రభుత్వ భూమి ఒక్క ఎకరం కూడా లేదా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయినా అధికారులు, సర్పంచ్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ స్థలములో మొక్కలను పెంచారు. ఈ బృహత్ పల్లెట ప్రకతి వనం లో ప్రస్తుతం 23,000 మొక్కలు జీవం పోసుకుని ఎంంతో ఆహ్లాదకరంగా సుందరంగా ఉన్నాయి. గానుగ 2500 మొక్కలు జామ 1000 ఉసిరి 300 దేవకాంచన 1200 ఖర్జూర 400 నిమ్మ 150 మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి గుల్మొరా 2000 వేప 1800 బాదం 1000 దానిమ్మ 300 నెమలినారు 400 గిన్నెట 200 చింత 2500 గంగరావి 1000 గన్న్ఱేరు 50 మొక్కలు ఉన్నాయి దిరిసెన 1250 మందారం 200 పారిజాతం 100 వెలగ 200 టేక్‌ను 1200 మొక్కలు ఉన్నాయి ఇవిగాక మరికొన్ని ఇతర మొక్కలు కూడా బహత్ పల్లె ప్రకతి వనములో పెరుగుతున్నాయి. నాటిన ప్రతి మొక్క జీవం పోసుకుంది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ సోమవారం చిరునోముల లో గల బహత్ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. బహత్ పల్లె ప్రకతి వనాన్ని మొత్తం కలియ తిరిగారు. ఈ సందర్భంగా అక్కడ కొన్ని ఏర్పాట్ల్ను చేయాలని కలెక్టర్ సూచించారు మొత్తం కలిసి తిరిగిన తర్వాత మండల అధికారులపై, చిరునోముల సర్పంచ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. బృహత్ పల్లె ప్రకతి వనం చాలా బాగుంది అంటూ ఆనందం వ్యక్తం చేశారు. నాడు వద్దు అన్న కలెక్టరే నాలుగు నెలల కాలంలోనే బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి ఆశ్చర్యం పోవటం కలెక్టర్ వంతు అయింది. బహత్ పల్లె ప్రకతి వనాన్ని కలెక్టర్ ను విశేషంగా ఆకర్షించింది. ఈ వనం లో గల వివిధ రకాల రాళ్ళకు వాటికి అనుగుణంగా రంగులు వేసి మరింత సుందరంగా తీర్చి దిద్దాలని కలెక్టర్ అధికారు లకు సూచించారు. నాడు వద్దన్న కలెక్టరే నేడు బహత్ ప్రకతి వనం పై ప్రశంసల జల్లు కురిపించటంతో మండల అధికారులు, చిరునోముల సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి తడిసి ముద్దరు ఆనందంలో మునిగి తేలుతున్నారు.