Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-వేంసూరు
శ్రీ రాజ సాయి మందిరం వి ఎం బంజర్ ఆధ్వర్యంలో ఖమ్మం మమత మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ సహకారంతో వేంసూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర, దంత వైద్య శిబిరం విజయవంతమైంది. లింగపాలెం అంబేద్కర్ యూత్. సహాయ సహకారాలతో 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారిలో 50 మందికి ఆపరేషన్ అవసరమని గుర్తించి వీరిని ఖమ్మం మమత మెడికల్ కాలేజీలో ఉచితంగా శస్త్రచికిత్స చేయడం జరుగుతుందని శ్రీ రాజ సాయి మందిరం.చైర్మన్ శిబిరం నిర్వాహకులు విజయ నరసింహరెడ్డి తెలిపారు. శిబిరాన్ని స్థానిక సర్పంచ్ ఫైజూద్దిన్. ప్రధానోపాధ్యాయురాలు కష్ణకుమారి ప్రారంభించారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం అవసరమైనవారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు శిబిరంలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ మహేష్. అభినందన్. కృష్ణసాయి, విక్రమ్, దంత వైద్యులు. డాక్టర్ మౌనిక. హరికృష్ణ,. చరిత, అమూల్య, హర్ష వైద్య పరీక్షలు నిర్వహించారు