Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్ మ్యాచ్ విజేత చింతలపూడి
- మున్సిపల్ ఛైర్మెన్ మహేశ్ చేతుల మీదుగా బహుమతుల ప్రదానం
నవతెలంగాణ- సత్తుపల్లి
గత నెల 22వ తేదీన సత్తుపల్లిలోని జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆటస్థల మైదానంలో ప్రారంభమైన అనుమోలు నరేశ్‌కుమార్ మెమోరియల్ ట్రస్ట్ వారి అంతరాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ మంగళవారంతో ముగిశాయి. ఫైనల్ మ్యాచ్‌లో ఖమ్మం- చింతలపూడి జట్లు తలపడగా చింతలపూడి జట్టు మొదటి బహుమతిని గెలుచుకుంది. రెండో స్థానంలో ఖమ్మం జట్టు నిలిచింది. ఈ సందర్భంగా జరిగిన ముగింపు కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఏఎన్‌కే ట్రస్ట్ నిర్వాహకులు మనోహర్ భరత్ అనుమోలు మాట్లాడుతూ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన కళాశాల ప్రిన్సిపాల్ పాలనెం రామచంద్రరావుకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని క్రీడాభిమానులు టోర్నమెంట్‌ను తిలకించి క్రీడాకారులను ఉత్తేజపర్చారన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అద్దంకి అనిల్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు వల్లభనేని పవన్, సేవా వాలంటరీ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు చీపు గంగాధర్, అబ్దుల్లా, ట్రస్ట్ బాధ్యులు అనుమోలు సురేశ్, తిరువూరు మాజీ సొసైటీ అధ్యక్షులు జంగా చెంచురెడ్డి పాల్గొన్నారు.