Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
ఐద్వా ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర నాయకులు అఫ్రోజ్ సమీనా మాట్లాడుతూ గొప్ప సంఘ సంస్కర్త , రచయిత్రి , మొదటి మహిళా ఉపాధ్యాయురాలు , విద్యను అందించడంలోను , సామాజిక న్యాయం విషయంలోనూ , కుల నిర్మూలన విషయంలోనూ, పూజారుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం లోనూ , స్త్రీల సమస్యలను పరిష్కరించడంలో, సాంప్రదాయంలో ఉన్నా హీన్నత్వాన్ని వ్యతిరేకించడంలోనూ , త్యాగం , ధైర్యం , పట్టుదలలోను సావిత్రిబాయికి భారత దేశంలో ఇంకెవరూ సాటిరారు అని అన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో సావిత్రీ బాయిపూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. జనవరి మూడువ తేదీన జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం దినంగా ప్రకటించాలని, ఆమె వర్ధంతి రోజైన మార్చి 10న జాతీయ మహిళా దినోత్సవంగా జరపాలని, హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద ఖమ్మం ట్యాంక్ బండ్ మీద సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకులు మెహరున్నీసాబేగం, ఆజిత, శ్రీదేవి, హెలెన్ పరిమళ, వసంత,ఫరీదా, తదితరులు పాల్గొన్నారు