Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేష్
- జేవీఆర్ కళాశాలలో ఆర్వో వాటర్‌ప్లాంట్ ప్రారంభం
నవతెలంగాణ-సత్తుపల్లి
విద్యార్ధులకు సురక్షితమైన నీటిని అందించేందుకు ఏఎన్‌కే ట్రస్ట్ బాధ్యులు భరత్‌కుమార్ అనుమోలు ఆర్వో వాటర్‌ప్లాంట్‌ను వితరణ అందించడం పలువురికి ఆదర్శప్రాయ మని సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మెన్ కూసంపడి మహేష్ అన్నారు. మంగళవారం స్థానిక జేవీఆర్ కళాశాలలో వితరణ చేసిన ఆర్వో వాటర్‌ప్లాంట్‌ను ఆయన ప్రారంభించి ట్రస్ట్ బాధ్యులను అభినందించారు. అనంతరం జనవరి చివరి నెలలో నేపాల్‌లో జరగబోయే అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు ఎంపికైన కళాశాల విద్యార్ధి యాగంటి కిరణ్‌కుమార్(బీకాం ఫస్ట్ఇయర్)కు మహేష్ రూ.6వేల నగదును ప్రోత్సాహక బహుమానంగా అందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పానెం రామచంద్రరావు, అధ్యాపకులు విజరుకుమార్, కిరణ్‌కుమార్, వీరన్న, బంగారి, రాంబాబు, వినోద్‌కుమార్, మధు, వీరారెడ్డి, చెన్నారావు, శ్రీనివాసరావు, విజయలకీë, చాంద్, అశోక్‌కుమార్, రామారావు, విద్యార్ధులు పాల్గొన్నారు.