Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వైరా టౌన్
వైరా పట్టణంలోని ఎస్ఆర్ ఠాగూర్ విద్యాసంస్థలో శుక్రవారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాలు ప్రారంభ సూచికగా భోగి మంటలను వేసిన అనంతరం విద్యార్థినులకు ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ ఠాగూర్ విద్యాసంస్థల చైర్మన్ సంక్రాంతి సునీత, కరస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్ ముగ్గుల పోటీలను ప్రారంభించారు. ముగ్గుల పోటీలలో వంద మంది విద్యార్థినులు పాల్గొన్నారు.కార్యక్రమంలో ఠాగూర్ విద్యాసంస్థల డైరెక్టర్ సంక్రాంతి సంయోగిత, ప్రిన్సిపాల్ చింతనిప్పు కష్ణారావు, పుచ్చకాయల రామకష్ణ, నాగలక్ష్మి, గుంటుపల్లి కష్ణ, అనిల్, సింధు, లత, నందిని ఆరోగ్య అధికారిని వెంకట నరసమ్మ, హెల్త్ అసిస్టెంట్ గోపాలకష్ణ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.