Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంఎల్ఏ మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ- ముదిగొండ
తెరాస ప్రభుత్వం హయాంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, హింస పెరిగిందని సీఎల్పీ నేత మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. వెంకటాపురంలో కాంగ్రెస్ పార్టీ మహిళా సంఘం మండల అధ్యక్షులు గుడిపూడి ఝాన్సీ నివాసంలో ముఖ్యకార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాద్రి జిల్లాలో పాల్వంచలో టీఆర్ఎస్ నాయకులు వనమా రాఘవ దాష్టీకానికి ఓ కుటుంబం బలైందన్నారు. మానవమృగం రాఘవను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెరాస ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలపై మహిళలు ఉద్యమించాలన్నారు. ఈనెల 9 నుండి మండలంలోని యడవల్లి గ్రామం నుండి ప్రజా సమస్యల పరిష్కారానికి నియోజకవర్గ స్థాయిలో పాదయాత్ర చేపట్టనున్నట్లు, ఈపాదయాత్రలో ప్రధానంగా మహిళలు అధికసంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పి.దుర్గాప్రసాద్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు దొబ్బల సౌజన్య, జిల్లా నాయకులు రాయల నాగేశ్వరరావు, మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజ్గర్, పార్టీ మండల అధ్యక్షులు కొమ్మినేని రమేష్ బాబు, నాయకులు బుల్లెట్ బాబు, గుడిపూడి బుచ్చిరామయ్య, ఉసికల రమేష్ పాల్గొన్నారు.