Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
దుకాణాదారుల యజమానులు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని గ్రామపంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్ మూల్పూరి స్వప్న, ఉయ్యూరి మల్లికలు పేర్కొన్నారు. జమలాపురం గ్రామ పంచాయతీలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఏర్పాటు చేసేందుకు గ్రామస్తులు, దుకాణదారులు సహకరించాలని వారు కోరారు. శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేష్ బాబు ఆధ్వర్యంలో షాపుల యజమానులకు నోటీసులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి జుట్ బ్యాగులను వాడాలని సూచించారు. ఇకనుండి గ్రామంలో ప్లాస్టిక్ కవర్లను, ప్లాస్టిక్ వస్తువులను వినియోగించిన వారికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వెయ్యి రూపాయలు జరిమానా విధించుటకు పంచాయతీ తీర్మానం చేసినట్లు వారు తెలిపారు. అదే విధంగా కరోన వ్యాధి మూడో వేవ్ విజంభిస్తుండంతో ప్రతి ఒక్క రూ మాస్కు ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని వారు గ్రామస్తులను కోరారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వరికూటి సురేష్ బాబు, పీట నరసింహారావు, కృష్ణారావు, వజినేపల్లి సింధు, శ్రీ లక్ష్మీ, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.