Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 15 సంవత్సరాల విద్యార్థినీ, విద్యార్థులకు 'కరోనా' వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా తమ విద్యాసంస్థల్లో నిర్వహించు కున్నామని 'హార్వెస్ట్' విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్ తెలిపారు. తమ విద్యాసంస్థల్లో ప్రస్తుతం 15 సంవత్సరాల వయసుగల విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాక్సినేషన్ ఇప్పించడం జరిగిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి విస్తరిస్తున్న సందర్భంలో ప్రతిఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరని తెలిపారు. ప్రస్తుత తరుణంలో ఒమిక్రాన్ వేరియంట్ సామాజిక వ్యాప్తి ప్రారంభమయిందని, ప్రతిఒక్కరు తగు జాగ్రత్తలతో పాటు, పండుగలు, పెళ్ళిళ్ళు, తదితర కార్యక్రమాలు తగ్గించుకొని ఇళ్ళలోనే నిర్వహించుకోవడం ఉత్తమమన్నారు. తమ విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇంటర్మీడి యట్ అలాగే ప్లస్1, ప్లస్ 2 విద్యార్థినీ విద్యార్థులు 400 కాగా, అలాగే 9, 10 తరగతుల విద్యార్థినీ విద్యార్థులు 425 మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేశారని. ఈ సందర్భంగా జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి రాజేష్, జిల్లా మలేరియా అధికారి సైదులు, మెడికల్ అధికారి జి. సౌమ్య, ప్రోగ్రామ్ అధికారి ప్రమీల, హెచ్ఈవో సత్యనారాయణ, ఆర్.బి.ఎస్.కె. రంగయ్యకి, వ్యాక్సిన్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో 'హార్వెస్ట్' విద్యాసంస్థల ప్రిన్సిపల్ ఆర్. పార్వతీరెడ్డి , విద్యాసంస్థల సిబ్బంది పాల్గొన్నారు.