Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
మండలంలోని పెద్దతండా పంచాయతీ పరిధిలో గల ఇందిరమ్మ కాలనీలో ఒక సంవత్సరం క్రితం నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని ఐద్వా రూరల్ మండల అధ్యక్షురాలు ఏటుకూరి పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐద్వా, సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ సర్వే నెంబర్ 142 ఇందిరమ్మ కాలనీలో నిర్మించిన అంగన్వాడీ కేంద్రం నిర్మాణం పూర్తి చేసుకుని సంవత్సర కాలం అవుతున్నా ప్రారంభానికి నోచుకోకపోవడం దారుణమన్నారు. పిల్లలు అంగన్వాడి స్కూల్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యుడు నందిగామ కృష్ణ మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం పనులు సక్రమంగా జరగకపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఏటుకూరి ప్రసాద్‌రావు, కాలనీవాసులు కళ్యాణి, నిర్మల, జయమ్మ, శ్రీను, నాగేశ్వరరావు, చారి, పగిళ్ళబ్రహ్మం పాల్గొన్నారు.