Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
సంక్రాంతి పండుగ సంబరాలతో స్మార్ట్ కిడ్జ్ పాఠశాల పరవశించింది. ప్రకృతికి అనుసంధానంగా వివిధ రకాల సంబరాల మేళవింపుగా పాఠశాల విద్యార్థుల ఉత్సవాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ చిన్నారులు భోగిపండ్లు పోసి, భోగి మంటలు వేసి, భోగి పాటలు పాడుతూ అలరించారు. వివిధ రకాల ధాన్యాలతో సంక్రాంతి లక్ష్మి ఘనంగా అలంకరించారు. విద్యార్థులు గాలిపటాలు ఎగరేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ,పాఠశాల ప్రాంగణమంతా రంగు రంగుల ముగ్గులతో, గొబ్బెమ్మలతో కన్నుల విందుగా పండుగ వాతావరణాన్ని ముందే తీసుకొచ్చారు. రైతు వేషధారణతో అదేవిధంగా పాడిపంటలతో కలకలలాడే కుటుంబ వాతావరణం నేపథ్యాన్ని తలపిస్తూ చిన్నారులు భలే సందడి చేశారు. స్మార్ట్ కిడ్జ్ బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ సంస్కతి సంప్రదాయాలను చిన్నారులకు తల్లిదండ్రులు నేర్పాల్సిన అవసరం ఉందని, కుటుంబ నేపథ్యాల మధ్య సందడిగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని, సంక్రాంతి పండగ విశిష్టతను విద్యార్థులకు వివరిస్తూ చిన్నారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.