Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, వైరా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుక చౌదరి ప్రధాన అనుచరుడు కొణిజర్ల సర్పంచ్ సూరంపల్లి రామారావుని గురువారం రాత్రి నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఈవిషయం గ్రామంలో కలకలం రేపింది. రామారావును కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఆ నలుగురు ఎవరనేది పోలీసుల విచారణలో తేలాల్సిఉంది. ఈ సందర్భంగా సర్పంచ్ సూరంపల్లి రామారావు శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గురువారం రాత్రి సుమారు పదిన్నర సమయంలో కారులో నలుగురు వ్యక్తులు వచ్చి తలుపులు కొట్టారని,. తలుపులు తీయగానే వచ్చిన వ్యక్తులు గుర్తుపట్టకుండా మాస్కులు, గ్లౌజులు ధరించి ఉన్నారన్నారు. మావోయిస్టు పార్టీ జగన్ పేరుతో లెటర్ ఫ్యాడుని చూపించి మాట్లాడేది ఉందని కారెక్కలాని అడగడంతో ఇంట్లోకి వెళ్లి బట్టలు వేసుకొని వస్తానని చెప్పి లోపలికి వెళుతుండగా వచ్చిన అ గుర్తుతెలియని వ్యక్తులు తనతో పాటు ఇంట్లోకి వస్తుండగా వారిని ప్రతిఘటించి ఇంట్లో నుంచి బయటకు పరుగులు పెట్టి తన ప్రాణాలను కాపాడుకున్నానని తెలిపారు. వచ్చిన వ్యక్తుల వద్ద ఫిస్టల్లు ఉన్నాయన్నారు. బయటకు వచ్చి ఎదురుగా ఉన్న మెడికల్ షాపులో వారికి సమాచారం ఇవ్వగానే గమనించిన గుర్తుతెలియని అగంతకులు వచ్చిన కారులో పరారయ్యారని తెలిపారు. ఎంతోమంది తన వద్దకు రాజకీయలకుతీతంగా పలురకాల సమస్యలతో పనులు చేయమని వస్తుంటారని ఎవరిని ఇబ్బందులు పెట్టకుండా సానుకూలంగా సమస్యలను పరిష్కరిస్తుంటానని పేర్కొన్నారు.
రామారావును పరామర్శించిన కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు
కిడ్నాప్ విషయం తెలుసుకున్న మహిళా కాంగ్రెస్ జిల్లా అద్యక్షురాలు దొబ్బల సౌజన్య, వడ్డె నారాయణలతో పాటు మండల కమిటీ టీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు, జిల్లా నాయకులు కోసూరి శ్రీనివాస్‌రావు, రాయల పుల్లయ్య తదితరులు పరమర్శించారు. అనంతరం స్థానిక పోలీసు స్టేషన్‌తోపాటు వైరా సీఐ వసంత్ కూమార్‌కు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం ఉదయం సీఐ వసంత్ కూమార్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రాధమిక విచారణ జరిపి సీసీ కెమెరాలను పరిశీలించారు. కిడ్నాప్ చేసేందుకు వచ్చింది ప్రయివేట్ వ్యక్తుల లేదా మావోయిస్టుల అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది..