Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు మరియు 15 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు వ్యాక్సి నేషన్ ప్రక్రియ ప్రారంభం అయినవి. వ్యాక్సినేషన్ ప్రక్రియను మండల విద్యాశాఖ అధికారి కె వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ డా.పి భూమేష్ రావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ తెలుగువారికి ఒక సాంప్రదాయ పండుగని , ఈ పండుగకు కోడి పందాలు, ఎడ్ల పందాలు, పొట్టేలు పందాలు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించటం ఆనవాయితీ అన్నారు.అంతేగాక తెలుగు సాంప్రదాయాలు ఈ పండుగలో ప్రస్ఫుటం అవుతాయని అన్నారు. అలాగే 15సంవత్సరాలు నిండిన విద్యార్థులకు వ్యాక్సిన్ను పాఠశాలకే వచ్చి ఇవ్వడం అభినందనీయం అన్నారు. కరోనా వేరియంట్లు రకరకాలుగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ వేయటం ప్రభుత్వం బాధ్యతగా భావించినా ప్రతి ఒక్కరూ మాస్క్ భౌతిక దూరం పాటించాల్సిందే నన్నారు. కార్యక్రమంలో సీనియర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ భువన ప్రసాద్, ప్రిన్సిపాల్ షాజీ మాథ్యూ, ఏఓఎస్ నరసింహారావు ఉపాధ్యాయ బందం పాల్గొన్నారు