Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- పెనుబల్లి
పెనుబల్లి మండలం గంగాదేవిపాడు గ్రామంలో తీసుకున్న రుణాలు చెల్లించ లేదని డీసీసీబీ సిబ్బంది శుక్రవారం లబ్ధిదారుల ఇళ్లు జప్తు చేశారు. బ్యాంకు మేనేజర్ అనిల్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో అధికారులు గ్రామాల్లోకి చేరుకొని లబ్ధిదారుల ఇళ్లలో ఉన్న బియ్యం, ధాన్యం రుణాలు పొందిన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాలపరిమితి దాటినా రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు నిర్బంధ వసూళ్లకు పాల్పడ్డారు. ఇంటి తలుపులు సైతం తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పలువురు మహిళలు రుణాలు చెల్లిస్తామని సమయం కావాలని కోరినప్పటికీ బ్యాంకు అధికారులు పట్టించుకోకుండా తన పని కానిచ్చేశారు.