Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
మండలంలోని గంగారం సాయిస్పూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్ధులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చెన్నుపాటి విజరుకుమార్ మాట్లాడుతూ అపోహలు వీడి ప్రతీ ఒక్కరూ వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిచేసుకోవాలన్నారు. సుమారు 210 మంది విద్యార్ధులకు ఈ క్యాంపులో వ్యాక్సిన్‌ను అందించారు. హెటెరో డ్రగ్స్ అధినేత, కళాశాల ఛైర్మెన్ బండి పార్ధసారధిరెడ్డి విద్యార్ధులకు, అధ్యాపకులకు వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహణపై అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వీఎస్ రత్నకుమారి, ఎస్ఎస్ఎస్ కోఆర్డినేటర్ బలుసుపాటి సీతారాం, అన్ని బ్రాంచీల విభాగాధిపతులు, విద్యార్ధులు పాల్గొన్నారు.