Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
మహనీయుల ఆశయాలతో, ఫొటోలతో డీవైఎఫ్ఐ క్యాలెండర్ తీయడం.... యువతలో, ప్రజల్లో ప్రచారం చేయడం అభినందనీ యమని, యువత సమాజ మార్పుకి కృషి చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు, ప్రముఖ విద్యావేత్త ఐవి. రమణారావు, డివైయఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్‌లు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక గట్టయ్య సెంటర్లోని డాక్టర్స్ అకాడమీ మెడికల్ కాలేజీలో డివైయఫ్ఐ నూతన సంవత్సర క్యాలెండర్‌ను నున్నా నాగేశ్వరరావు, ఐవి రమణారావు, కాలేజి కరస్పాండెంట్ రాయల సతీష్ బాబులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఇంట్లురి అశోక్, యంగ్ ఉమెన్, జిల్లా కో-కన్వీనర్ ఉష, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వడ్రాణపు మధు, జిల్లా ఉపాధ్యక్షుడు తుడుం ప్రవీణ్, డివైయఫ్ఐ కమిటీ సభ్యులు కూరపాటి శ్రీనివాస్, ధారవత్ రవికుమార్, షేక్ షరీఫ్, షేక్ పాషా, జిల్లా నాయకులు అంగిరేకుల సత్యనారాయణ, సాగర్, అనిల్, జోస్న తదితరులు పాల్గొన్నారు.