Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సంస్థ జనరల్ మేనేజర్ ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ-చండ్రుగొండ
వివాంట సీడ్స్ బెంగళూరు వారి గార్గి ఎఫ్-1 కొత్తరకం విత్తనాలతో మిర్చి పంటలో అధిక దిగుబడులు వస్తున్నాయని వివాంట సీడ్స్ జనరల్ మేనేజర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గానుగపాడు గ్రామానికి చెందిన సొసైటీ చైర్మన్, ఆదర్శ రైతు చెవుల చందర్ రావు తన వ్యవసాయ భూమిలో ఈ సంవత్సరం వివాంట సీడ్స్ వారి గార్గి ఎఫ్-1 చెందిన కొత్తరకం మిరప విత్తనాలు వేసాడు. దీంతో అతని మిరప తోటలో మిరప పంట విపరీతంగా కాయడంతో పాటు కాయబరువు ఉండటంతో రైతు హర్షం వ్యక్తం చేశాడు. చుట్టుపక్కల ఉన్న రైతులందరూ మిర్చి పంటను పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొత్తరకం విత్తనాలతో అధిక దిగుబడులు సాధించిన రైతును వివాంట సీడ్స్ కంపెనీ సంస్థ నిర్వాహకులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంస్థ జనరల్ మేనేజర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కొత్త రకం విత్తనాలు సుమారు 100 కేజీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, ప్రాంతాల్లో రైతుల పొలాల్లో వేయడం జరిగిందని వేసిన అన్ని చోట్ల కూడా చీడ పీడలను తట్టుకొని అధిక పూత కాపు కాసిందని సుమారు ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల కాపు కాసి నట్లు వెల్లడించారు. ఈ సంవత్సరం గార్గి ఎఫ్-1 తో రైతుల్లో కూడా హర్షం వ్యక్తం కావడంతో వచ్చే సంవత్సరం అన్ని గ్రామాల్లో విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు తగు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ రీజినల్ మేనేజర్ సిహెచ్ కిషోర్ కుమార్, సీడ్స్ డిస్ట్రిబ్యూటర్ ఎస్ నవీన్ కుమార్, కంపెనీ సేల్స్ ఆఫీసర్ దేవేందర్, డీలర్లు చెవుల చందర్ రావు, మచ్చా కుమార్, కాంతారావు, సంస్థ ప్రతినిధుల బృందం, రైతులు పాల్గొన్నారు.