Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అసిస్టెంట్ ఎకౌంటు ఆఫీసరా.. మజాకా..!
అ కాంట్రాక్టు కార్మికులకు చుక్కలు చూపిస్తున్న పట్టించుకోని వైనం
అ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలో విద్యుత్ కార్యాలయంలో అసిస్టెంట్ ఎకౌంట్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఓ అధికారి అంతా నా ఇష్టం అంటూ.. కింది స్థాయి కార్మికులతో పాటు అధికారులు సైతం ముప్పుతిప్పలు పెడుతూ... నేనింతే అంతా నా ఇష్టం.. అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి.. భద్రాచలంలో అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ గా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ అధికారి పూర్తి స్థాయి అధికారి హౌదాలో తనకంటే పై అధికారులు సైతం లెక్క చేయకుండా అంతా తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. విద్యుత్ శాఖలో పని చేస్తున్న బిల్ కలెక్టర్లు, మీటర్ రీడింగ్ కార్మికులు, పిఏఏ సూపర్వైజర్లను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ,మానసికంగా వేధిస్తున్నారని ఆరోపణలు సైతం ఉన్నాయి. శుక్రవారం ఏకంగానే కార్యాలయంలోపై అధికారులకు సమాచారం ఇవ్వకుండా బిల్ కలెక్టర్లు, మీటర్ రీడింగ్ కార్మికులు, పీఏఏ సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రకటన చేయడమే కాకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం పట్ల ఈ అధికారిపై తీవ్ర ఆక్షేపణలు వెలువడుతున్నాయి. వాస్తవానికి బిల్ కలెక్టర్లు, మీటర్ రీడింగ్ కార్మికులు, పిఏఏ సూపర్వైజర్లు వుండి తమ విధులు నిర్వహిస్తున్నప్పటికీ వారు తన మాట వినడం లేదన్న అక్కసుతోనే ఈ అధికారి ఏకపక్షంగా ఇంటర్వ్యూలు నిర్వహించడం, ఈవ్యవహారాలు చూస్తున్న ఉన్నతాధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరించడం పట్ల తీవ్ర ఆక్షేపణ వ్యక్తమవుతున్నాయి.