Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
టీఎన్జివో కార్యాలయంలో మాదిగ హక్కుల దండోరా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో టీఎన్జివో ఖమ్మం జిల్లా అధ్యక్షులు అఫ్జల్ హసన్‌ను, జిల్లా కార్యదర్శి ఆర్వి సాగర్‌ను, జిల్లా నాయకులు నందగిరి శ్రీనివాస్‌ను మర్యాద పూర్వకంగా కలిసి బొకే ఇచ్చి, శాలవలతో ఘనంగా సన్మానించి నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ దుప్పేల్లి శ్రీనివాస్, ఇల్లందు నియోజకవర్గ ఇంచార్జ్ సగుర్తి కోటేశ్వరావు, కనకపూడి వీరస్వామి, ఖమ్మం నియోజవర్గ ఇన్చార్జి భరత్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.