Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
వైరా మండలం సిరిపురం గ్రామ పంచాయతీ ఆధ్వర్యం లో శనివారం గ్రామపంచాయతీ పరిధి లోని బిపి రోగులకు వైద్య పరీక్షలు నిర్వ హించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ సర్పంచ్ మట్టూరి ప్రసన్నాంభ మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి నెలా 2వ శనివారం రోగులకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు మోటూరి కృష్ణారావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు హసీనా, గ్రామ కార్యదర్శి హనుమంతరావు, ఏఎన్ఎం చంద్రకళ, ఉపసర్పంచ్ బోడ్డు రంగా, నాయకులు నాగేశ్వరరావు, కనగరత్నం, ఆశ కార్యకర్తలు నాగేంద్ర, రేణుక తదితరులు పాల్గొన్నారు.