Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమలాయపాలెం
పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కరోనాని జయించాలని మండలంలోని బీరోలు శివాలయంలో ఆయన అభిమానులు శనివారం పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ బోడ మంగీలాల్ మాట్లాడుతూ నిరంతరం పేద ప్రజల కోసం పరితపించి ఆలోచించే ఎమ్మెల్యేకు కరోనా రావడం బాధాకరం అన్నారు. త్వరలోనే ఉపేందర్‌రెడ్డి కోలుకొని మళ్లీ ప్రజల్లోకి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల తొమ్మిదిన కందాళ ఉపేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీరోలు సర్పంచ్ వంచర్ల సత్యనారాయణరెడ్డి అలివేలమ్మ, ఎంపీటీసీ ఏనుగు మాలతి శ్రీధర్, శివాలయ కమిటీ చైర్మన్ మట్టపల్లి చంద్రారెడ్డి, కొప్పుల శ్రీనివాస్‌రెడ్డి, ఎన్నం సుధాకర్‌రెడ్డి, వడ్డే నర్సిరెడ్డి, ఎన్ పాపిరెడ్డి, కొత్తపల్లి వెంకట్ రెడ్డి, బోనగిరి సోమయ్య తదితరులు పాల్గొన్నారు