Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కామేపల్లి
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికి ఆదర్శమని ఇల్లందు నియోజక వర్గ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. మండల పరిధిలోని పండితాపురం గ్రామంలో శనివారం రైతుబంధు సంబరాల్లో భాగంగా ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత గ్రామంలో ఎడ్లబండ్లతో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ సునీత రాందాస్, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ధనియాకుల హనుమంతరావు, మండల ప్రధాన కార్యదర్శి సుందర్, ఆత్మకమిటీ సభ్యులు యలమద్ది అప్పారావు, ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కె భాస్కర్ నాయక్, కోటమైసమ్మ ఆలయ కమిటీ చైర్మెన్ మల్లేంపాటి శ్రీనివాసరావు, కొమ్మినేపల్లి పంచాయతీ సర్పంచ్ దుర్గా జ్యోతి, ఉపసర్పంచ్ కొమ్మినేని శ్రీనివాసరావు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు అచ్చయ్య, పత్యే మహమ్మద్, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
వేంసూరు : రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశానికి ఆదర్శవంతమైనవి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన రైతు బంధు వారోత్సవాల్లో పాల్గొని ప్రసంగించారు. ముందుగా వ్యవసాయ శాఖ ఉద్యానవనం శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల పంటలు కూర గాయల, చిరుధాన్యాల ప్రదర్శనలు మహిళ సం ఘాలు ఏర్పాటుచేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వేంసూర్ మండలంలో 16,758 మంది లబ్ధిదా రులకు రైతుబంధు ఎనిమిది విడతలగా అందించడం జరిగిందని, 115 మంది చనిపోయిన రైతు కుటుంబాలకు రైతు బీమా కింద ఒక్కో కుటుంబానికి 5 లక్షలు నేరుగా రైతు కుటుంబానికి అందించిన ఘనత కెసిఆర్కె దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో కుంచపర్తి. పల్లె వాడలో ఉన్న ప్రభుత్వ భూములలో పామాయిల్ మొక్కల నర్సరీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగుతు న్నాయని, వీటితో పాటు వేంసూరు మండలంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల, జిల్లా రైతు బంధు అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, రైతుబంధు మండల అధ్యక్షులు వెల్ది జగన్మోహన్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఎంపీపీ వెంకటేశ్వరావు, డిసిసిబి డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి, వైస్ ఎంపీపీ దొడ్డ శ్రీలక్ష్మి, పాల వెంకటరెడ్డి, తాసిల్దార్ ఎండి ముజాహిద్, ఎంపీడీవో వీరేశం, మండల వ్యవసాయ అధికారి రామ్మోహన్, ఎంఈఓ సిహెచ్ వెంకటేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు వేణుగోపాల్ రెడ్డి, నాయుడు వెంకటేశ్వరరావు, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైరా : నియోజకవర్గ పరిధిలోని ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో నిర్వహించారు. మార్కెట్ చైర్మన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే లావు డ్యా రాములు నాయక్ పాల్గొని ప్రసంగించారు. 10వ తేదీన రైతు సంబరాలు ముగింపు రోజు కాబట్టి ఐదు మండలాల కార్యకర్తలు రైతులు అధికారులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ జైపాల్ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, ఎంపీపీ వేల్పుల పావని, జెడ్పిటిసి నంబూరి కనకదుర్గ, రైతు బంధు కన్వీనర్ మిట్టపల్లి నాగి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, డార్ణ రాజశేఖర్ పాల్గొన్నారు.