Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అనే భరోసా నింపి, పేదలకు ఆపనన్న హస్తం అందిస్తూ, భరోసా నింపే నాయకుడు మన ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అని వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ కొనియాడారు. టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు సిఫారసు మేరకు మంజూరైన రూ.33.16లక్షల విలువైన, 70 సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం సాయంత్రం ఎంపీ నామ క్యాంపు కార్యాలయంలో జరిగింది. టీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి అధ్యక్షతన జరిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, అశ్వారావుపేట నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు జారె ఆదినారాయణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.