Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
గీతా ఫౌండేషన్, మైసూర్ వారు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన భగవద్గీత శ్లోకాల పారాయణం పోటీలలో నగరంలోని న్యూవిజన్ పాఠశాల విద్యార్ధిని కేతినేని చంద్రహాసిని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణ పతకాన్ని సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ యం.డి.అబాద్ అలీ తెలిపారు. గీతా ఫౌండేషన్, మైసూర్ శ్రీ గణపతి సచ్చిదానందస్వామి వారి ఆధ్వర్యంలో దేశ, విదేశాలలోని ఔత్సాహికులకు భగవద్గీత శ్లోకాల పారాయణ పోటీ నిర్వహించారు. ఈ పోటీలో అన్ని వయసులవారు పాల్గొనగా న్యూవిజన్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న కేతినేని చంద్రహాసిని చక్కటి ఉచ్ఛారణతో 700 శ్లోకాలు అనర్గళంగా కంఠతా చెప్పి నిర్వాహకులను అబ్బురపరచి, స్వర్ణపథకాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. జనవరిలో జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో శ్రీ గణపతి సచ్చిదానందస్వామి వారి నుండి స్వర్ణ పథకం, ప్రశంసాపత్రం అందుకోవడం జరిగింది. చిరుప్రాయంలోనే అద్భుత పారాయణం చేసి, నిర్వాహకులను ఆశ్చర్యపరచిన చిన్నారిని న్యూవిజన్ విద్యాసంస్థల చైర్మన్ సిహెచ్జికె ప్రసాద్, ప్రిన్సిపాల్ యండి. అబాద్ అలీ, తెలుగు ఉపాధ్యాయబృందం అభినందించారు.