Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
భవిష్యత్ కమ్యూనిస్టులదేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. మండలంలోని తల్లంపాడు గ్రామంలో శనివారం పార్టీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తల్లంపాడు గ్రామ పంచాయతీ పరిధిలో మరణించిన అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం వేల్పుల భూషయ్య స్థూపం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పోతినేని మాట్లాడుతూ తల్లంపాడు గ్రామ శాఖ ఆధ్వర్యంలో 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ప్రింట్ వేయించడం అభినందించదగ్గ విషయం అన్నారు. ఈ సందర్భంగా సీపీఎం గ్రామ శాఖను ప్రత్యేకంగా ప్రశంసించారు. యువతా కమ్యూనిస్టు పార్టీల వైపు రావాలని సూచించారు. రాబోయే ఎన్నికలల్లో దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు క్రియాశీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి, సీపీఎం సీనియర్ నాయకులు బత్తినేని వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, జిల్లా కమిటీ సభ్యులు ఉరడి సుదర్శన్ రెడ్డి,నాయకులు నందిగామ కృష్ణ, తెల్దారుపల్లి సర్పంచ్ సిద్దినేని కోటయ్య, నాయకులు పల్లె శ్రీనివాసరావు, మల్లయ్య, డాక్టర్ రంగారావు,ఉప సర్పంచ్ యామిని ఉపేందర్, వట్టికోట నరేష్, నువ్వుల నాగేశ్వరరావు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.