Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - బోనకల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఘటనలో నలుగురు మృతికి కారణమైన కొత్తగూడెం టిఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును కఠినంగా శిక్షించాలని సిపిఎం సీనియర్ నాయకులు పిల్లలమర్రి వెంకట అప్పారావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి బంధం శ్రీనివాసరావులు డిమాండ్ చేశారు. ముష్టి కుంట గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు దొప్ప కొరివి వీరభద్ర, షేక్ నజీర్, అప్పా చారి, బొడ్డుపల్లి నాగ బ్రహ్మం, దుగ్గి వెంకటేశ్వర్లు, పిల్లలమర్రి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు