Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
ఈ వ్యవసాయ సీజన్లో మిర్చి పంటకు తామర పురుగు, నల్లి సోకి లక్షలాది ఎకరాల్లో పంట పూర్తిగా నాశనం అయింది, తెలుగు రాష్ట్రాల్లో రైతులకు పది వేల కోట్ల రూపాయలు నష్టం, ప్రకృతి విపత్తు ప్రకటించి రైతులకు నష్టపరిహారం అందించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. మండల పరిదిలోని పోచవరం గ్రామలో పార్టీ మండల కమిటీ సమావేశం కార్యదర్శి మాదల వెంకటేశ్వరరావు అధ్యక్షుతన జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తామర పురుగులు వేరు కుళ్ళుడు వైరస్, తెగుళ్లు వచ్చిన మిర్చి పంటను రైతులు తొలిగిస్తున్నారన్నారు. 2021-2022 వ్యవసాయ సీజన్ ప్రారంభం నుంచి అధిక వర్షాలు కురవడం వల్ల మిర్చి నారుమళ్లు దెబ్బ తిన్నాయి, మిర్చి నారు పొలంలో నాటిన తర్వాత కూడా రెండవ సారి మరల మిర్చి మొక్కలు నాటి ఆర్థికంగా నష్టపోయారన్నారు. మిర్చి పంటలకు మంచి రేట్ ఉండడంతో రైతులు పంటలను కాపాడుకోవడానికి వేల రూపాయలు ఖర్చు చేసి మందు పిచికారీ చేశారని అన్నారు. జనవరి మొదటి వారంలో సైతం మిర్చి తోటలు రైతులు తొలిగించారని అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కనీస స్పందన లేదన్నారు. జనవరి 2 తేదీ నుంచి 10 తేదీ వరకు గ్రామాల్లో, మండల కేంద్రాలలో రైతు బంధు పధకంపై రైతు ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నైనా మిర్చి రైతులకు జరిగిన నష్టంపై రైతు బంధు కన్వీనర్లు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు ప్రస్తవించాలి కదా, అదేమీ లేదన్నారు. మిర్చి రైతులకు ఎకరాకు కనీసం లక్ష రూపాయలు పరిహారం, కౌలు రైతులకు లక్ష రూపాయలు తోపాటు అదనంగా కౌలు కూడా కలిపి నేరుగా రైతు బ్యాంకు ఎకౌంటు కు జమ చేయాలన్నారు. ఈ కార్య క్రమంలో పార్టీ సీనియర్ నాయకులు తాతా భాస్కరరావు, మండల కార్యదర్శి మాదల వెంకటేశ్వరరావు, తన్నీరు క్రిష్ణార్జునరావు, ముదిగొండ అంజయ్య, బట్టు నరసింహారావు, దోమతొట్టి పుల్లయ్య, సామినేని హనుమయ్య, నాయుడు చందరరావు, తిగుళ్ళ బాబు తదితరులు పాల్గొన్నారు.
వనమా రాఘవేంద్రను కఠినంగా శిక్షించాలి
సత్తుపల్లి : మానవ మృగం వనమా రాఘవేంద్రను కఠినంగా శిక్షించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. శనివారం స్థానిక మదర్‌ధెరిస్సా పాఠశాలలో జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠల్ అధ్యక్షతన నిర్వహించిన 4 మండలాల జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. పాల్వరచలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్ర ఇన్నాళ్లు సాగించిన అకృత్యాలపై సీబీఐ దర్యాప్తు నిర్వహించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పంటలు సరిగా పండక చిన్న, సన్నకారు, మిర్చి పంటల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే చిన్న,సన్నకారు రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ ఈ విషయంలో జోక్యం చేసుకుని నష్టపరిహారం ఇచ్చేందుకు దరఖాస్తులను స్వీకరించాలని కోరారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు తాతా భాస్కర్, జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, జాజిరి శ్రీనివాస్‌రావు, వేంసూరు మండల కార్యదర్శి జగన్మోహన్రావు, పెనుబల్లి మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు, సత్తుపల్లి టౌన్ కార్యదర్శి రావుల రాజబాబు, సీఐటీయూ నాయకులు మల్లూరు చంద్రశేఖర్, కొలికపోగు సర్వేశ్వరరావు, ఎన్. ప్రతాప్, రైతు సంఘం నాయకులు కొత్తా సత్యనారాయణ, ఎం.వెంకటేశ్వరరావు, లకీë, కుమారి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.