Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ప్రజలకు ఆరోగ్య సేవలను అందించడంలో డా.వైఆర్కె నెల నెలా వైద్య శిబిరం తన వంతు బాధ్యతను నిర్వహిస్తోందని నిర్వాహకులు, రిటైర్డ్ ఆర్జెడి యాదాల చార్లెస్ అన్నారు. ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు స్థానిక గుమస్తాల సంఘ భవనంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ శిబిరంలో ప్రముఖ డాక్టర్ల బృందం రోగులను పరీక్షించి వారికి అవసరమైన బిపీ, షుగర్ మందులను నెలకు సరిపడా కేవలం 100 రూపాయలకే అందిస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే ఇతర ఆరోగ్య, వైద్య సలహాలను ప్రజలకు వైద్య శిబిరం అందిస్తోందని అన్నారు. దీని వలన ప్రజలకు కొంత ఉపశమనం కలుగుతోందని తెలిపారు. ఈ శిబిరం నిర్వహణకు సహకరిస్తూ , ఉచిత సేవలు అందుస్తున్న డాక్టర్స్ బృందానికి, వాలెంటీర్స్ బృందానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వైద్య శిబిరం నిర్వాహకులు యాదాల చార్లెస్, బండారు రమేష్, యర్రా శ్రీనివాసరావు, భుక్యా శ్రీను, తుశాకుల లింగయ్య, పత్తిపాక నాగసులోచన, బండారు యాకయ్య, ఇంటూరి అశోక్, శీలం వీరబాబు, మలిశెట్టి రామారావు, హుస్సేనయ్య, డాక్టర్ల బృందం డా.పి.సుబ్బారావు, డా.కెయు భాస్కర్, డా.నాగేశ్వర రావు, డా.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.